గిద్దలూరులో మిగులు భోజనం పంపిణీ
అన్నం పరబ్రహ్మ స్వరూపం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు
ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 మార్కాపురం జిల్లా
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం రాత్రి గిద్దలూరు మున్సిపాలిటీ బిజెపి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జే వీ నారాయణ కార్యకర్తలకు అభిమానులకు రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు వేలాదిమందికి భోజనం పెట్టాలనే ఆశతో మంచి స్వభావంతో ఏర్పాటు చేశారు అయితే అందులో మిగిలిన భోజనాన్ని వృధా కాకూడదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి కి తెలియచేస్తే ఈ భోజనానికి న్యాయం జరుగుతుందని నమ్మకంతో బి యస్ నారాయణరెడ్డి కి ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బి యస్ నారాయణరెడ్డి మరో సామాజిక కార్యకర్త ఏరువ రమణారెడ్డి సహాయంతోటి మిగిలిన భోజనాన్ని గిద్దలూరు రైల్వే స్టేషన్ ముందు బాగాన తాగుడుకు బానిసలై మానసికంగా దెబ్బతిని ఇంటి వసతులు లేక రైల్వే స్టేషన్ ముందు బాగాన ఉన్న స్థలాన్ని శేష పాన్పుగా అనుకొని దోమలకు ఆహారంగా నిలుస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతోమంది అక్కడ నిద్రిస్తూ ఉండేవారు ఎక్కువగా ఉన్నారు అటువంటి వారికి బాటసారులకు సాధువులకు నిరుపేదలకు కడుపేదలకు అవ్వ తాతలకు మిగులు భోజనాలను పంపిణీ చేశామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలిపారు మిగులు భోజనాలను ఆకలితో ఉన్నవారికి వృధా కాకుండా అందించడంతో వారు కడుపునిండా భోజనం చేసి భోజనం అందించిన వారిని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించడమే కాకుండా చల్లగుండు నాయనా అని ఆశీర్వదించడం జరుగుతుందన్నారు ఏమిచ్చినా ఇంతటి గొప్ప ఆశీర్వాదాలు దొరకవన్నారు పదిమందికి భోజనం అందిస్తే మంచి జరుగుతుందన్న నమ్మకాన్ని శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన తెలిపారన్నారు ఆ బాటలోనే ఈ విధంగా భోజనం అందిస్తున్నామన్నారు వృధా కాకుండా భోజనం ఉంది అని తెలిపిన డాక్టర్ జే వి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ఈ భోజనాన్ని పంపిణీ చేయడంలో మరి కొంత మంది సహాయపడ్డారు వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు దాదాపు 200 మందికి పైగా 10 రకాల తో ఉన్న భోజనాన్ని అందించారు వచ్చిన వారందరికీ టీ కొట్టు నారాయణమ్మ మినరల్ వాటర్ అందించారు. ఈ విధంగా శుభకార్యాలలో ఎక్కడైనా మిగులు భోజనాలు ఉంటే తప్పకుండా తెలియజేయాలని బి యస్ నారాయణరెడ్డి కోరారు 9441932390 సెల్ నెంబర్ ను సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఏరువ రమణారెడ్డి ఆర్ట్ ఆఫ్ లివింగ్ డిఓటి పడకండ్ల రమణ వాల్మీకి షేక్ బిబి మరికొందరు స్నేహితులు పాల్గొన్నారు.