*గడపగడపకు మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు*
మార్నింగ్ వాక్‌లో ప్రజలతో మమేకం.. సమస్యలపై తక్షణ పరిష్కారం
ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 7
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ. ఆదేశాల మేరకు అశ్వరావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏ ఎస్ ఆర్ నగర్, డ్రైవర్ కాలనీ, హోసన్న మందిరం రోడ్డు, జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే పట్టణంలోని పలు బజారు ప్రాంతాల్లో వ్యాపారస్తులను, స్థానిక ప్రజలను కలిసి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రాంతాలను సైతం సందర్శించి ప్రజల పరిస్థితులను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశుభ్రత మనందరి బాధ్యత. మన మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంటే మండలం బాగుంటుంది.. మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది.. జిల్లా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు చక్కటి సూచనలు చేశారు.ఎన్నికల తర్వాత కూడా ప్రజల మధ్యే నాయకులు.. స్థానికుల ప్రశంసలు ఉదయాన్నే తమ కాలనీలకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు తీరుపై స్థానిక ప్రజలు, పెద్దలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి ఎంతోమంది నాయకులు వస్తారని, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకునే నాయకులు అరుదని అన్నారు. అయితే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు.గెలిచిన తర్వాత కూడా ఉదయాన్నే తమ వార్డులకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు.ప్రజల వద్దకే పాలన.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యం అనే విధంగా సాగుతున్న ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు,.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట మండల కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, 10వ వార్డు కౌన్సిలర్ మిండా హరిబాబు.19వ వార్డు కౌన్సిలర్ ఎస్.కె. నూర్జహాన్, 22వ వార్డు కౌన్సిలర్ నార్లపాటి దివాకర్, దండా బత్తుల రమేష్, తాడేపల్లి రవి, కానూరి మోహన్ రావు, దయాకర్, దోరేపల్లి కరుణ, పసుపులేటి మహేష్, అశ్వరావుపేట మున్సిపల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పసుపులేటి ఫణింద్ర (నాని),స్థానిక ప్రజలు, వార్డు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,