prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 8:30 am Digital Edition : PRAJA VANI

కోటగిరిలో ఘనంగా ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

కోటగిరిలో ఘనంగా ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.

సందడిగా షాట్ బౌండరీ క్రికెట్ హంగామా.40 టీమ్‌ల హోరాహోరీ.

బ్యాటింగ్ చేసిన సర్పంచ్ మధుకర్.బౌలింగ్ చేసిన రవికుమార్.

వికెట్ కీపింగ్‌తో ఆకట్టుకున్న డా.ఎం.ఏ.హకీమ్.

కోటగిరి/ప్రజావాణి:- నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ క్రికెట్ షాట్ బౌండరీ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.ఈ టోర్నమెంట్‌ ను గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్,బీఆర్ఎస్ నాయకులు డా.ఎం.ఏ. హకీమ్,తేల్ల రవి కుమార్,బీజేపీ నాయకులు పబ్బ శేఖర్,శ్రీ వివేకానంద హైస్కూల్ డైరెక్టర్ గోగినేని హనుమంతరావులు సంయుక్తంగా టోర్నమెంట్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్ బ్యాటింగ్ చేయగా బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవికుమార్ బౌలింగ్ వేశారు.అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఎం.ఏ.హకీమ్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించి టోర్నమెంట్‌ను వినూత్న రీతిలో ప్రారంభించారు.ఈ టోర్న మెంట్‌ లో మొత్తం 40 జట్లు పాల్గొంటున్నాయని.విజేతగా నిలిచిన విన్నర్ జట్టుకు రూ.20 వేల నగదు,రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ.10 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేయనున్నారనీ మేనేజ్మెంట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ మేనేజ్‌మెంట్ నిర్వాహకులు హరికృష్ణ (చింటూ),శివ,మంజూరు,ముదస ర్,హజార్,కృష్ణ లతో పాటు పలువురు గ్రామ పెద్దలు, గ్రామస్థులు,వివిధ జట్ల సభ్యులు పాల్గొన్నారు.