*కృష్ణ ప్రసాద్ సేవలు అభినందనీయం: సీఐ వడ్డేపల్లి మురళి*
ముదిగొండ, నవంబర్ 1 ప్రజావాణి
ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహించిన కృష్ణ ప్రసాద్‌కు న్యూ లక్ష్మీపురం రిసార్ట్‌లో ఘనంగా పదవి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌హెచ్‌ఓ, సీఐ వడ్డేపల్లి మురళి హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా సీఐ వడ్డేపల్లి మురళి మాట్లాడుతూ, ఎస్సై కృష్ణ ప్రసాద్ ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన కాలంలో బాధ్యతాయుతంగా, నిబద్ధతతో సేవలందించారని కొనియాడారు.విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ, సహచరులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ప్రతి పోలీసు అధికారి అనుసరించాల్సిన అంశాలని పేర్కొన్నారు.పోలీసు శాఖలో ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందారు అని సీఐ సూచించారు. ఎస్సై కృష్ణ ప్రసాద్ భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన కాలంలో తనకు సహకరించిన ఉన్నతాధికారులు, సహచర పోలీసు సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిగొండతో తనకు ఏర్పడిన అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.అనంతరం ఎస్సై కృష్ణ ప్రసాద్‌ను పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కుసమంచి సీఐ సంజయ్ కుమార్, ఖమ్మం రూరల్ సీఐ రాజు, ముదిగొండ,నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కామేపల్లి, కూసుమంచి మండలాల ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బంది, ఎస్సై కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.