*కృష్ణ కాలనీలో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు*
మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్,నవంబర్ 8:
మంచిర్యాల్ నస్పూర్ కార్పొరేషన్ పరిధిలోని కృష్ణ కాలనీ 3వ డివిజన్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న ఆకుడరి తిరుపతి గారి ఇంట్లో ఘనంగా దీపావళి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణ కాలనీ 3వ డివిజన్ కార్పొరేటర్ పత్తి పకృతి వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సందర్భంగా పత్తి పకృతి వెంకటేష్ మాట్లాడుతూ
నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతూ, జీవితాంతం నీడనిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గొప్ప ఆశయమని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో భాగస్వాములయ్యారు.
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతోమంది కుటుంబాలకు భరోసాగా నిలుస్తోంది. వారు చెప్పడం జరిగింది