కృష్ణవేణిలో కనుల పండుగగా దీపావళి వేడుకలు
**కృష్ణవేణిలో కనుల పండుగగా దీపావళి వేడుకలు* *రాయికల్:నవంబర్ 07 (ప్రజావాణి):* రాయికల్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రాంగణం శుక్రవారం దీపకాంతులతో, విద్యార్థుల కోలాహలంతో కళకళలాడింది. దీపావళి పండుగను పురస్కరించుకొని పాఠశాల యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక వేడుకలు విద్యార్థులకు పండుగ విశిష్టతను, భారతీయ సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపించాయి.కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థులు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు? శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన శుభ సందర్భం, నరకాసురుడిపై శ్రీకృష్ణుని విజయం, లక్ష్మీదేవి ఆవిర్భావం వంటి పౌరాణిక గాథలను చక్కని ప్రసంగాల రూపంలో వినిపించారు. చిన్నారుల...