కూకట్‌పల్లిలో కొత్త వ్యాపారానికి శ్రీకారం.. ‘బెస్ట్ వాఫిల్స్ ఇన్ ది టౌన్’ ప్రారంభం
నూతన షాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి నవంబర్ 1(ప్రజావాణి)
కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘బెస్ట్ వాఫిల్స్ ఇన్ ది టౌన్’ షాప్‌ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ రాణించేందుకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, చిన్నతులసి అశోక్ తదితరులు పాల్గొన్నారు.