prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 1:06 pm Digital Edition : PRAJA VANI

కుటుంబ వేడుకలో భాగస్వామ్యమైన వడ్డేపల్లి రాజేశ్వరరావు

కుటుంబ వేడుకలో భాగస్వామ్యమైన వడ్డేపల్లి రాజేశ్వరరావు

దుర్గా భవాని నూతన కారును ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

కూకట్‌పల్లి, నవంబర్ 4 (ప్రజావాణి):

వివేకానంద నగర్ కాలనీకి చెందిన వేగి వరప్రసాద్ గారి సోదరి యాదంరెడ్డి దుర్గా భవాని నూతనంగా కారు కొనుగోలు చేసిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ప్రత్యేక అతిథిగా పాల్గొని నూతన వాహనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా దుర్గా భవాని కుటుంబ సభ్యులు రాజేశ్వరరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, తమ కుటుంబంలోని శుభకార్యంలో పాల్గొని నూతన వాహనాన్ని ప్రారంభించాలని కోరారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన రాజేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి వాహనానికి ప్రారంభోత్సవం నిర్వహించి, అందులో తొలి ప్రయాణం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దుర్గా భవాని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమవుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే రాజేశ్వరరావు నాయకత్వ లక్షణాలు తమకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తమ కుటుంబంలోని సంతోషకరమైన వేడుకకు ఆయన హాజరై నూతన వాహనాన్ని ప్రారంభించడం జీవితాంతం మరిచిపోలేని మధుర జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆహ్వానాన్ని గౌరవించి విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వడ్డేపల్లి రాజేశ్వరరావు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, ప్రజాసేవలో మరింత కీలక బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, కీర్తిప్రతిష్ఠలు, విజయాలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.