కాస్య తండా సర్పంచ్ పై..
నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు.
ప్రజావాణి,నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాస్య తండా సర్పంచి బోడ నర్సింహ నాయక్ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ఆ తండా వాసులు సోమవారం ఎంపీడీవో సింగారపు కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ అభివృద్ధి పనులు చేయకుండానే బిల్లులు తీసుకోవడమే కాకుండా, ఒకే పనిపై మూడుమార్లు బిల్లులు తీసుకొని 15వ,ఆర్ధిక సంఘం నిధులు, గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారని, ఎందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకొని, దుర్వినియోగం చేసిన నిధులను రికవరీ చేయాలని ఫిర్యాదులో కోరినట్లు చెప్పారు.గ్రామపంచాయతీ అవసరం లేకపోయినా 12 మైకులు తెచ్చి 18 మైకులు అని 15వ,ఆర్ధిక సంఘం గ్రాంట్ నిబంధనలను పాటించకుండా రూ.1,30,000 వేలు డ్రా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తండాలోని నవీన్ ఇంటినుండి హుస్సేన్ ఇంటి వరకు ఎలాంటి పైపు లైన్ వేయకుండానే డబ్బులు తీసుకున్నాడని .జీపీ బిల్డింగ్ కు పెయింటింగ్, ట్రాక్టర్ రిపేర్, ఆఫీస్ టేబుల్ అంటూ కేవలం రెండు నెలల వ్యవధిలోనే 2026 ఎప్రిల్, మే నెలల్లో ఒకసారి రూ.16,000,మరోసారి రూ.27,800, ఇంకో మారు రూ.40,000 లు రూపాయలను విడుదల చేశారన్నారు. కేవలం మరో ఐదు నెలల వ్యవధిలోనే 2026 అక్టోబర్ నెలలో ట్రాక్టర్ రిపేర్ కోసంరూ.82,650 లు విడుదల చేశారని దరఖాస్తులో పొందుపరిచారు.గత సర్పంచ్ కాలంలో చేసిన పనికి కూడా ప్రస్తుత సర్పంచ్ నిధులను తీసుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ పైన, వారికి సహకరించిన ఆనాటి అధికారులపైన చర్యలు తీసుకొని, నిధుల దుర్వినియోగాన్ని జరుగకుండా చూడాలని పిటిషన్ లో కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ సర్పంచ్ బానోత్ బుజ్జి వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ వీర్సన్న, రత్యా నాయక్, బాలాజీ, వీరన్న, వెంకన్న, ఖీమా, యాకూబ్, సురేష్ తదితరులు వున్నారు.