*కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదు.. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం – ఎమ్మెల్యే చింతా ప్రభాకర్*
మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి ప్రతినిధి నవంబర్:08
బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కూరాకుల సంతోష్ కుమార్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ.. ధైర్యం, భరోసా
సదాశివపేట మండలం సూరారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కూరాకుల సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ దుర్భాషలాడుతూ, చంపేస్తానని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధిత కుటుంబాన్ని సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారు పరామర్శించారు.
ఈ ఘటనపై వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూరారం గ్రామానికి వెళ్లి సంతోష్ కుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
రాజకీయ కక్షలతో వ్యక్తిగత దాడులకు దిగడం, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాజకీయాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప, బెదిరింపులు, దౌర్జన్యాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే చర్యలను సహించేది లేదు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ యాదవ్, గొల్లగూడెం సర్పంచ్ మునిగే నవీన్, కౌన్సిలర్ కలియుముద్దీన్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మండల యువత అధ్యక్షులు నరేష్ గౌడ్, మైనార్టీ అధ్యక్షులు నిజామొద్దీన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాండు నాయక్, మాజీ సర్పంచ్ సలావుద్దీన్, శ్రీహరి, నాయకులు రమేష్, రాందాస్, రాజు గౌడ్, బిక్షపతి, యూసుఫ్, మనోహర్, నజీర్ పటేల్, సర్వేశ్వర్, మల్లేశం, బందెయ్య, ఇలియాస్, కమురుద్దీన్, అలీముద్దీన్, తుల్జయ తదితరులు పాల్గొన్నారు