prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 7:29 pm Digital Edition : PRAJA VANI

కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే పల్లా.. వడ్లకొండ, యశ్వంతపూర్‌లో పరామర్శ

కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే పల్లా.. వడ్లకొండ, యశ్వంతపూర్‌లో పరామర్శ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్,నవంబర్ 10(ప్రజావాణి) : జనగామ మండలం వడ్లకొండ, యశ్వంతపూర్ గ్రామాల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పర్యటించారు.
వడ్లకొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త పన్నీరు లక్ష్మణ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మణ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు.
తర్వాత అదే గ్రామానికి చెందిన మాజీ మండల పార్టీ కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు బొల్లం గంగా రాములు సతీమణి బొల్లం విజయలక్ష్మి మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు.
తదుపరి చివరగా
యశ్వంతపూర్ గ్రామానికి చెందిన మాజీ బీఆర్ఎస్ వార్డు సభ్యుడు గడ్డం నాగేష్ వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి కిందపడి గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. నాగేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా కష్టకాలంలో వారికి తోడుగా నిలుస్తానని భరోసా కల్పించారు.