prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 6:21 pm Digital Edition : MAHESH MEDCHAL

కార్మికుల పక్షాన నిలబడే నాయకుడు సురేష్ బీఆర్టీయు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్

మేడ్చల్ కార్మికుల పక్షాన నిలబడుతూ, వారి సమస్యల పరిష్కారానికి మేడ్చల్ నియోజకవర్గ బీ ఆర్ టీ యు అధ్యక్షుడు వై. సురేష్ కృషి మరువలేనిదని మేడ్చల్ జిల్లా బీ ఆర్ టీ యు అధ్యక్షులు సంబు ప్రభాకర్ కొనియాడారు. సోమవారం వై. సురేష్ పుట్టినరోజు సందర్భంగా సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో బీ ఆర్ టీ యు నాయకులు, పలువురు కార్మికులు సురేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులకు అండదండగా ఉంటూ సేవలందిస్తున్న సురేష్ లాంటి నాయకుడు ఈనాటి సమాజానికి ఎంతో మేలు అన్నారు. ఇలానే మరిన్ని పదవులు అధిరోహిస్తూ సురేష్ మారింత అభివృద్ధి చెందాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్, రాజేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.