*కాంగ్రెస్ నాయకుడు తోట కనకరాజు యాదవ్ టీఆర్పీలో చేరిక*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10 (ప్రజావాణి):జిల్లాలోని రఘునాథపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తోట కనకరాజు యాదవ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో, జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తోట కనకరాజు యాదవ్ మాట్లాడుతూ “ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజ్యాధికారం కోసం తీన్మార్ మల్లన్న చేస్తున్న పోరాటం ఎంతో గొప్పది. ఆయన ఆశయాలకు ఆకర్షితుడై, ఆయన వెంట నడుస్తూ రాజ్యాధికారం సాధించే వరకు పోరాటం చేస్తాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్పి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుdu పిట్టల సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా యువజన అధ్యక్షులు యమంకి విజయ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ముక్క విష్ణు, జనగామ పట్టణ మైనారిటీ యూత్ అధ్యక్షులు పాషా తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.