prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 5:37 pm Digital Edition : PRAJA VANI

కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన మర్మాముల సర్పంచ్ సత్యనారాయణ

మద్దూరు నవంబర్8, ప్రజా వాణి,

ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మద్దూరు మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి కేక్ కట్, విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేసిన అనంతరం మర్మాముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ముఖ్య మంత్రికి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ శ్రీ ఇప్ప నిషికాంత్ రెడ్డి. మర్మాముల గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్,గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు ఆలేటి విష్ణు,గ్రామ వార్డు మెంబర్ బంగ్లా సరిత సుధాకర్ రెడ్డి,మద్దూరు గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగు రాజు,విజయ డైరీ చైర్మన్ తిరుపతి రెడ్డి,యువ నాయకులు సాయి కుమార్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మాల రాజు,కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.