prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 3:34 pm Digital Edition : PRAJA VANI

కష్టానికి గుర్తింపు.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహం.

కష్టానికి గుర్తింపు.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రోత్సాహం.

రూ.12 వేల విలువైన 101 ఉత్పత్తుల పంపిణీ.

*మన ప్రజావాణి*
*జన్నారం*

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో గురువారం ఏడీఎంఎస్ డిస్ట్రిబ్యూటర్లకు రూ.12 వేల విలువైన 101 ఉత్పత్తులను బహుమతిగా గురువారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ గుగ్లావత్ సంగీత చేతుల మీదుగా, పంచాయతీ కార్యదర్శి కల్యాణి సమక్షంలో నలుగురు డిస్ట్రిబ్యూటర్లకు ఈ ఉత్పత్తులను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గుగ్లావత్ సంగీత మాట్లాడుతూ.. ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించడం ఎంతో అవసరమన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదల, నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న విజయాలను సాధించవచ్చని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్లు తమ పనిపై నమ్మకంతో, ఐకమత్యంతో ముందుకు సాగాలని, ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఎలక్ట్రిక్ వాహనాన్ని బుక్ చేసుకున్న వారికి రూ.12 వేల విలువైన ఉత్పత్తిని ఉచితంగా అందించడం డిస్ట్రిబ్యూటర్లకు అదనపు ప్రోత్సాహంగా నిలుస్తుందన్నారు. ఏడీఎంఎస్ సంస్థ నిర్దేశించిన “వన్ ఇయర్ వన్ సీఆర్” లక్ష్యంతో నెట్‌వర్క్ రంగంలో పనిచేస్తున్న వారు ప్రణాళికాబద్ధంగా, క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. ఇలాంటి ప్రోత్సాహకాలు మరింత మంది ముందుకు రావడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కమ్మల భూమయ్య, కోర్ కమిటీ సభ్యులు కామర వెంకటస్వామి, డిస్ట్రిబ్యూటర్లు కుక్కటి కారు రమేష్, దేవ రాజమౌళి, కుక్కటికారు రవితేజ, రేగుంట సుదర్శన్, రేగుంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..