prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 4:27 pm Digital Edition : PRAJA VANI

కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన దాక్షాయణికి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందనలు

కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన దాక్షాయణికి ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందనలు.
తదుపరి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం కోరిన విద్యార్థిని.. ప్రతిభను అభినందించిన పీఓ.

ఏటూరునాగారం నవంబర్ 02 ప్రజావాణి:

మెడారం ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు), ఎటూరునాగారానికి చెందిన విద్యార్థిని దబ్బగట్ల దాక్షాయణి కరాటే క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు, ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడంపై ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అభినందించారు.

విశాఖపట్నంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 24, 25 తేదీల్లో నిర్వహించిన 5వ కియా సౌత్ జోన్ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో దాక్షాయణి పాల్గొని ప్రతిభ కనబరిచింది. సబ్ జూనియర్ (12–15 సంవత్సరాలు) బాలికల కుమిటే విభాగంలో పాల్గొన్నట్లు ఆమెకు జారీ చేసిన సర్టిఫికెట్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దాక్షాయణి తన తదుపరి కరాటే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం అందించాలని పీఓను కోరింది. ఆమె క్రీడా ప్రతిభను అభినందించిన పీఓ, క్రీడల్లో మరింత రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్‌లో జరగనున్న తదుపరి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఆమె చేసిన విజ్ఞప్తిని పరిశీలనకు తీసుకున్నారు.

గిరిజన విద్యార్థుల్లో విద్యతో పాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం, వారికి తగిన అవకాశాలు కల్పించడం అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.