కమలాపూర్ శివారులో బైకు ప్రమాదం తండ్రి కూతుర్లకు తీవ్ర గాయాలు
ప్రజావాణి నవంబర్ 1 కమలాపూర్ నుండి దేశరాజుపల్లి వెళ్లే మార్గమధ్యలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో తండ్రి కూతుర్లకు తీవ్ర గాయాలయ్యాయి దేశరాజు పల్లి గ్రామానికి చెందిన మాట్ల ఐలయ్య అనే 40 సంవత్సరాల వ్యక్తి కమలాపూర్ నుండి బైక్ పై దేశరాజుపల్లి కి వెళ్తుండగా ఎదురుగా వచ్చే బైక్ ఢీకొనడంతో కుడికాలు తీవ్ర గాయాలయ్యాయి ఐలయ్య కూతురు మాట్ల స్వాత్విక కి కూడా కుడి కాలికి గాయాలయ్యాయి వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఈఎంటి ఉపేందర్ పైలట్ తిరుపతి హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు ప్రధమ చికిత్స అందిస్తూ ఇద్దరినీ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు