**కబడ్డీలో హనుమకొండ జిల్లా సత్తా.. రాష్ట్రస్థాయి అండర్-17 పోటీల్లో తృతీయ స్థానం!**
నవంబర్ 7:
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 కబడ్డీ పోటీల్లో 33 జిల్లాల జట్లు పాల్గొనగా హనుమకొండ జిల్లా జట్టు మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ విజయ సాధనలో వేలేరు గ్రామంలోని టీజీఆర్ఎస్ అండ్ జేసీ (బాలుర) విద్యాసంస్థకు చెందిన నలుగురు విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా విద్యార్థి సోంపెల్లి రోహిత్ తేజ హనుమకొండ జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం.
విద్యార్థులు రోహిత్ తేజ, చందు, విజయ్, రిత్విక్‌ల ప్రతిభను విద్యాసంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ రౌతు అజయ్ కుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.