prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 6:26 pm Digital Edition : PRAJA VANI

ఓటు హక్కును వినియోగించుకున్న గంజే నాగరాజు

ఓటు హక్కును వినియోగించుకున్న గంజే నాగరాజు

అనంత పురం బ్యూరో నవంబర్ 05 ప్రజా వాణి
శింగనమల నియోజకవర్గం, శింగనమల మండలం జుల కాలువ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గార్లదిన్నె టిడిపి జడ్పిటిసి అభ్యర్థి గంజే నాగరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య పటిష్టతకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించడం వల్ల ప్రజలకు ఎన్నో లాభాలు చేకూరుతాయని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని ప్రజలందరూ ఓట్లు వేస్తేనే ప్రజా ప్రతినిధి గా తయారవుతారని ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు. మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని తెలిపారు.