ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు

ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు బాన్సువాడ: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, తమ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని, గ్రామాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రార్థించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు....