ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్న బాన్సువాడ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు
బాన్సువాడ: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారిని బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, తమ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రజలందరికీ మంచి జరగాలని, గ్రామాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ప్రార్థించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య, బాన్సువాడ వ్యవసాయ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్. నర్సింలు, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు దేశాయిపేట్ ప్రశాంత్ కుమార్, డివిజన్ ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి, డివిజన్ నాయకులు పోతురాజు సాయిలు, మన్నె సురేష్, బండి విజయ్ తదితరులు పాల్గొన్నారు.