prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 11:08 am Digital Edition : PRAJA VANI

ఎల్ ని నో ప్రభావం పై ప్రజలకు అవగాహన సదస్సు

*ఎల్ ని నో ప్రభావం పై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ నినో ప్రభావాల పై ప్రజలకు అవగాహనా కార్యక్రమము లో భాగంగా చండూరు మునిసిపాలిటి పరిధిలోని 6 వ వార్డు నందు మున్సిపల్ చైర్మన్ & కమీషనర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గుతూ ఉన్నందున, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చూసుకోవాలని, భవనాల పై కప్పులై వర్షపు నీటి సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలను పెంపొందించాలి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున, ఇంట్లో అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, ఏసీలను ఆపివేసి విద్యుత్‌ను ఆదా చేస్తూ పొదుపుగా వాడాలని, భవిషత్తులో విధ్యుత్ & నీటి సమస్య వచ్చే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. నీటి పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, ఎల్ నినో అంటే ఏమిటి, దాని ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు, వర్షపాతం ఉష్ణోగ్రతల్లో సంభవించే మార్పుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎల్ నినో ప్రభావం రాబోయే రోజులలో తీవ్రంగా వుంటుందని తెలియజేయడమైంది. ఇంటి నల్లాలు, పైప్ లైన్లు & బహిరంగా నీటి కుళాయిల వద్ద నీటి లికేజిలు లేకుంగా చూసుకోవాలని, వాహనాలు కడగడానికి, ఇంటి ముందు ప్రదేశాలు శుభ్రం చేయడానికి తాగునీటిని ఉపయోగించకుండా వుండడం, వాడిన నీటిని మొక్కలకు పోయడం, తోటల పెంపకం వంటి అవసరాలకు తిరిగి వినియోగించుకోవలన్నారు. పట్టణ ప్రజలు నీటి సంరక్షణ కార్యక్రములో భాగస్వాములు కావాలని, బాధ్యతగా వుండాలని పేర్కొన్నారు.
“నీటిని ఆదా చేద్దాం – భవిష్యత్తును కాపాడుదాం”. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, మున్సిపల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.