prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 2:14 pm Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన వర్ధన్నపేట సీఐ సంజీవరావు

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన వర్ధన్నపేట సీఐ సంజీవరావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03(ప్రజావాణి):
పాలకుర్తి నియోజకవర్గం కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డిని ఇటీవల నూతనంగా వర్ధన్నపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI)గా బాధ్యతలు స్వీకరించిన సంజీవరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే కూడా నూతన సీఐ సంజీవరావు కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా రాయపర్తి మండల పరిధిలో గల గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన, వేగవంతమైన పోలీస్ సేవలు అందించడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, మహిళా భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సూచించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని నూతన సీఐ సంజీవరావు ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.