ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – లక్ష్మణ్ గౌడ్ మృతిపై ప్రభుత్వం స్పందించాలి..
ముందస్తు అరెస్టులను ఖండించిన మ్యాకల శ్రీకాంత్ యాదవ్ బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి) తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను, కుటుంబాలను పణంగా పెట్టి ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టీయూఎఫ్) బెజ్జంకి మండల అధ్యక్షులు మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేటికీ...