ఉదారత చాటుకున్న ప్రముఖ వైద్యులు ఆనంద్ రావు…
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 02
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు ఆనంద్ రావు తమ ఉదారతను మరోసారి చాటుకుంటున్నారు.. ఆయన తమ మండలం, తమ నియోజకవర్గంలో ఆయా రకాల సామాజిక, మరియు సేవా కార్యక్రమాల్లో తమ వంతు కృషి చేస్తున్నారు.. జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన దళిత సమాజానికి జాలయ్య మేస్త్రి రోడ్డు ప్రమాదంలో రెండు రోజుల క్రితం మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ ఆనంద్ రావు ఆదివారం రోజున వారి నివాసానికి వెళ్లి మృతిని కుటుంబానికి ప్రగఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు.. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.. మృతుని భార్య శాంతమ్మకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా దళితులు గ్రామస్తులు డాక్టర్ ఆనంద్ రావుకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు… ఈ సందర్భంగా పెద్ద ఏడ్గీ గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ అస్పత్వార్ వినోద్, గజానంద్ తదితరులు పాల్గొన్నారు..