prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 4:18 pm Digital Edition : PRAJA VANI

ఇల్లంతకుంట విశ్వబ్రహ్మణ,విశ్వకర్మ ఐఖ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక

ఇల్లంతకుంట విశ్వబ్రహ్మణ,విశ్వకర్మ ఐఖ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక

ఉత్కంఠభరిత ఎన్నికల్లో దేశరాజు తిరుపతి ఘన విజయం

ఇల్లంతకుంట, నవంబర్ 1 (ప్రజావాణి)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల విశ్వబ్రహ్మణ, విశ్వకర్మ ఐఖ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి.మొత్తం 373 ఓట్లు పోలవగా, అధ్యక్ష పదవికి పోటీ చేసిన దేశరాజు తిరుపతి 218 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి తిప్పారపు సంతోష్‌కు 151 ఓట్లు లభించాయి.కాగా 2 ఓట్లను చెల్లనివిగా ఎన్నికల అధికారులు పరిగణించారు.ఈ ఎన్నికల్లో దేశరాజు తిరుపతి స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడంతో సంఘ సభ్యులు,అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేశరాజు తిరుపతికి పలువురు అభినందనలు తెలియజేస్తూ, సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఎన్నికల అధికారులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు తుంకుంట మోహన్‌రెడ్డి, కోయ్యడ రాజయ్యలు బాధ్యతలు నిర్వహించారు.ఎన్నికల కోఆర్డినేటర్లుగా ఎర్రోజు సత్యం (వర్క్‌షాప్), తిప్పారపు స్వామిలు వ్యవహరించి ఎన్నికలను సజావుగా నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగియడంతో సంఘ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు దేశరాజు తిరుపతి మాట్లాడుతూ, సంఘ సభ్యులందరి సహకారంతో విశ్వబ్రహ్మణ, విశ్వకర్మ సోదరుల సంక్షేమం, సంఘ ఐక్యత మరియు అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.