ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆత్మీయ దీపావళి వేడుకలు జరుపుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆత్మీయ దీపావళి వేడుకలు జరుపుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటూ వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు, వారి జీవితాల్లో సంతోషాలు నింపడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు....