prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 10:52 am Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆత్మీయ దీపావళి వేడుకలు జరుపుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

*ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఆత్మీయ దీపావళి వేడుకలు జరుపుకున్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం
కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటూ వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు, వారి జీవితాల్లో సంతోషాలు నింపడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే గొప్ప సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. జనగామ నియోజకవర్గంలో ఏ ఒక్క పేద కుటుంబం కూడా గుడిసెల్లో, పెంకుటిళ్లలో నివసించే పరిస్థితి ఉండకూడదని, ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.

ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కలిసి జనగామ నియోజకవర్గానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని కొమ్మూరి ప్రతాపరెడ్డి ని కోరుతున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేయడం ఆయన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు.

సామాన్య కుటుంబాల మధ్యకు వెళ్లి వారితో కలిసి పండుగ జరుపుకోవడం, వారి సంతోషాల్లో భాగస్వాములు కావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్, కొమురవెల్లి మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్, గ్రామ ప్రజలు మరియు అభిమానులు పాల్గొన్నారు.