ఇంటర్మీడియట్ ఫలితాలపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలి
*ఇంటర్మీడియట్ ఫలితాలపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలి* *రాయికల్, నవంబర్ 09(ప్రజావాణి):* ఇంటర్మీడియట్ ఫలితాలపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వై. రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.కళాశాలకు చేరుకున్న ఆయన ముందుగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల వద్దకు వెళ్లి వారితో నేరుగా మాట్లాడారు. పాఠ్యాంశాలపై అవగాహన, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులు, హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకుల బోధనా తీరును కూడా సమీక్షించారు.అనంతరం ప్రిన్సిపాల్,...