prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 1:43 pm Digital Edition : PRAJA VANI

ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి

రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ కల్పించాలి

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేత

బెజ్జంకి, నవంబర్ 11 (ప్రజావాణి)

ఆశా కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బెజ్జంకి మండల ఆశా కార్యకర్తలు మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. తిమ్మాపూర్ ప్రజాభవన్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. 30 నెలలు గడుస్తున్నా హామీలు అమలుకునోచుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర ఆశా యూనియన్ అధ్యక్షురాలి సూచనల మేరకు డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మె నోటీసులో భాగంగా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఆశా కార్యకర్తల అధ్యక్షురాలు బండిపెల్లి భాగ్య, ఉపాధ్యక్షురాలు రజిత, సభ్యులు వెంకటలక్ష్మి, రేణుక, సౌమ్య, స్వప్న, రజిత, పుష్పలత, నాగమణి, మాధవి, రజిని, ప్రేమలత, లావణ్య, డి.పుష్ప, మనీషా తదితరులు పాల్గొన్నారు.