ఆప్తుడిని కోల్పోయిన బాధలోనూ ఆదర్శ నిర్ణయం.. శరీరదానానికి ముందుకొచ్చిన పద్మారావు కుటుంబం

ఘట్‌కేసర్, నవంబర్ 2 (ప్రజావాణి): కుటుంబ సభ్యుడిని కోల్పోయిన తీరని విషాదంలోనూ సమాజానికి ఉపయోగపడే గొప్ప నిర్ణయం తీసుకుని ఘట్‌కేసర్‌కు చెందిన పద్మారావు కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ ఆప్తుడి మరణం మరికొందరికి ఉపయోగపడాలనే ఉదాత్త ఆలోచనతో ఆయన మృతదేహాన్ని వైద్య పరిశోధనలకు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన కూసపాటి పద్మారావు (40) బ్రెయిన్‌డెత్‌కు గురికావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఆలోచించి, పద్మారావు మృతదేహాన్ని బీబీనగర్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన...