prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 6:46 pm Digital Edition : PRAJA VANI

ఆపదలో ఉన్న మెకానిక్ కుటుంబానికి చిలుకూరు ప్రెస్ క్లబ్ చేయూత

*ఆపదలో ఉన్న మెకానిక్ కుటుంబానికి చిలుకూరు ప్రెస్ క్లబ్ చేయూత*

*మానవత్వమే ప్రధాన లక్ష్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రెస్ క్లబ్ ప్రాధాన్యం*

*అధ్యక్షులు షేక్ మీరాసాహెబ్ చోరవతో నిత్యావసర సరుకుల పంపిణీ*

*చిలుకూరు నవంబర్ 08(ప్రజావాణి)*: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ సమాజ సేవలో జర్నలిస్టులు ముందుండాలని చిలుకూరు మండల ప్రెస్ క్లబ్ నిరూపించింది. బైక్ ప్రమాదంలో గాయపడి గత రెండు నెలలుగా పనికి వెళ్లలేక జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిలుకూరు మండలానికి చెందిన బైక్ మెకానిక్ మొగల్ నయీంపాషా కుటుంబానికి ప్రెస్ క్లబ్ సభ్యులు చేయూత అందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ మీరాసాహెబ్ చొరవతో నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను కుటుంబ సభ్యులకు అందజేశారు.ప్రమాదం కారణంగా వృత్తికి దూరమై కుటుంబ పోషణ భారంగా మారిన నయీంపాషా పరిస్థితిని గుర్తించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ మీరాసాహెబ్ తోటి జర్నలిస్టులతో చర్చించి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో నిత్యావసర సరుకులను సమకూర్చి బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు షేక్ మీరాసాహెబ్ మాట్లాడుతూ జర్నలిస్టులు కేవలం వార్తల సేకరణ, ప్రచురణకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న సమస్యలను గుర్తించి, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సహాయం అందేవిధంగా చూస్తామని తెలిపారు. సమాజంలో సేవాభావం, మానవత్వం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు.ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి నిత్యావసర సరుకులు అందించిన చిలుకూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులకు మొగల్ నయీంపాషా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ మీరాసాహెబ్ (ప్రజావాణి), నూకపంగు వీరబాబు (నినాదం), కందుకూరి వంశీకృష్ణ (జనం సాక్షి), అమరగాని కృష్ణ గౌడ్ (మీడియా టుడే), గవిని ఆంజనేయులు (మన దీపం), బొలిశెట్టి నాగేంద్రబాబు (అక్షిత న్యూస్), కందుకూరి కృష్ణమూర్తి (విజన్ ఆంధ్ర), లక్ష్మణ్ (నమస్తే తెలంగాణ), ఐనుద్దీన్ (జనం న్యూస్), న్యాయవాది కన్నం సాహెబ్, బీఆర్ఎస్ నాయకులు షేక్ పాషా, మసీదు కమిటీ అధ్యక్షులు యూసఫ్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.