prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 November 2026, 9:17 pm Digital Edition : PRAJA VANI

ఆపదలో అండగా 1098.. విద్యార్థులకు బాలల హక్కుల పై అవగాహన సదస్సు

*ఆపదలో అండగా 1098.. విద్యార్థులకు బాలల హక్కుల పై అవగాహన సదస్సు…*

నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గం,
ప్రజావాణి ప్రతినిధి
నవంబర్ 03:-

ప్రతినిధి నవంబర్ 02: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్‌ఎస్), కల్వకుర్తిలో విద్యార్థులకు మహిళా, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీం ఆధ్వర్యంలో మహిళా భద్రత, మానవ అక్రమ రవాణా నిరోధం, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవలపై విద్యార్థులకు వివరించారు. మహిళలు, బాలల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలల హక్కులు,ఆపద సమయంలో సంప్రదించాల్సిన 1098 హెల్ప్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో షీ టీం హెడ్ కానిస్టేబుళ్లు పద్మావతి, వెంకటస్వామి,మిషన్ వాత్సల్య విభాగం ప్రతినిధి మల్లీశ్వరి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సుమన్ కుమార్, ఉపాధ్యాయులు భాస్కర్,రీనా, అనీషా,రాహుల్, కీర్తి,అనూష, మల్లిక తదితరులు పాల్గొన్నారు.