అమీన్పూర్ డీసీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్
అమీన్పూర్, నవంబర్ 3 (ప్రజావాణి): అమీన్పూర్ సర్కిల్–47 నూతన డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కుమారి ఎ. లలిత శ్రావణిని అమీన్పూర్ మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్, పటేల్‌గూడ మాజీ సర్పంచ్ ఈర్ల నితీష్ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన డిప్యూటీ కమిషనర్‌కు అభినందనలు తెలియజేశారు. అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని కాలనీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని వారు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులకు సహకరిస్తామని తెలిపారు.