prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 6:05 pm Digital Edition : PRAJA VANI

అమరవాది లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా సేవే మార్గంగా వేడుకలు

అమరవాది లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా సేవే మార్గంగా వేడుకలు

-పుట్టినరోజు వేడుక కాదు.. సేవా కార్యక్రమమే నిజమైన వేడుక

-ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం, దుప్పట్ల పంపిణీ

-చలికాలంలో వృద్ధులకు వెచ్చదనం పంచిన ఆర్యవైశ్య మహాసభ

-గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అమరవాది లక్ష్మీనారాయణ అవకాశం కలిపించాలి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 10(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం జనగామలోని రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు చలికాలాన్ని పురస్కరించుకొని దుప్పట్ల పంపిణీ మరియు అన్నప్రసాద వితరణ, స్వీట్, పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు.

అదే విధంగా ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో మనసారా జరుపుకోవాలని కోరుకుంటూ, ముందు ముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కూడా రావాలని కోరుతున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి గను నరసింహులు, కోశాధికారి బేజగం బిక్షపతి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ వరూధిని మాదంశెట్టి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగిశెట్టి అనుజ, రాష్ట్ర ఈసీ మెంబర్ పడకంటి రవీందర్, వాసవి సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపర్తి శ్రీనివాసు, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.