prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 10:19 am Digital Edition : RAJU NANGUNOOR

అడిషనల్ అడ్వకేట్ జనరల్‌తో ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ భేటీ* *న్యాయ వ్యవస్థలో మార్పులు.. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ*

నంగునూరు, నవంబరు 3:తెలంగాణ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్ రెడ్డిని ఏఎంసీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్ హైదరాబాద్‌లోని హైకోర్టులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు న్యాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు.ప్రస్తుత న్యాయ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులు, సామాన్య ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాల్సిన అవసరం, ప్రజా సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు చూపే విధానాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. న్యాయపరమైన అవగాహన ప్రజల్లో పెంపొందించడంతో పాటు, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు తెలిసింది.ఈ సందర్భంగా సాదుల పవన్ కుమార్ మాట్లాడుతూ.. అడిషనల్ అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. న్యాయ రంగానికి సంబంధించిన అనేక అంశాలపై విలువైన అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ మర్యాదపూర్వక భేటీ ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.