అడవిదేవులపల్లిలో పెద్దింటి అంజమ్మ మృతదేహానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నివాళులు
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 09
అడవిదేవులపల్లి: మండలానికి చెందిన పెద్దింటి అంజమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వారి స్వగృహానికి చేరుకుని అంజమ్మ భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ బాలునాయక్ కొండా లక్ష్మణ్ గౌడ్, అల్లం నాగరాజు, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.