prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 11:47 am Digital Edition : PRAJA VANI

అక్రమ మద్యం పట్టివేత.

అక్రమ మద్యం పట్టివేత.

కంచికచర్ల పరిసర ప్రాంతాలలో ఎక్సైజ్ శాఖ దాడులు.

ప్రజవాణి దినపత్రిక ప్రతినిధి
నవంబర్ 5 (నందిగామ) ఎన్టీఆర్ జిల్లా

స్థానిక ఎన్నికల నేపథ్యంలో 198 కేసుల గోవా మద్యం పట్టివేత.

ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ సిహెచ్. లావణ్య మరియు ఎక్సైజ్ శాఖ ఎన్టీఆర్ జిల్లా సూపరిండెంట్ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కంచికచర్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని.

గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కంచికచర్ల ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పలుచోట్ల దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో కంచికచర్ల పరిసర ప్రాంతంలో గల ఒక కోల్డ్ స్టోరేజ్ నందు సిబ్బంది గదులలో అక్రమంగా నిలువ ఉంచిన 198 బాక్సుల (9504 మద్యం సీసాలు) గోవా మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు వీఆర్వో సమక్షంలో స్వాధీనం చేసుకుని.

కోల్డ్ స్టోరేజ్ సూపర్వైజర్ అయినటువంటి ఉప్పు గోపీనాథ్ ను అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం కంచికచర్ల ఎక్సైజ్ స్టేషనుకు తరలించారు.

ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమక్షంలో ఎఫ్ఐఆర్ నెంబర్ 139 / 2026 గా కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా సదరు ముద్దాయికి న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు..

స్వాధీనం చేసుకున్నటువంటి మద్యాన్ని కంచికచర్ల ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నందు భద్రపరిచినారు…

తదుపరి విచారణ అనంతరం పూర్తి వివరాలను తెలియజేస్తామని ఎక్సైజ్ శాఖ సీఐ అష్రపున్నిస బేగం తెలిపారు.