అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలి
అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచి లీల,సూపర్వైజర్ సునీత ప్రజావాణి,నెల్లికుదురు:ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణిలు,బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి,ఐసిడిఎస్ సూపర్వైజర్ జలగం సునీత సూచించారు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు అంగన్వాడీ సెంటర్లో విసిపిసి కమిటీని గురువారం ఏర్పాటు చేశారు.దీనికి స్థానిక సర్పంచి ఇట్టె లీల దేవేందర్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జలగం సునీత, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ ప్రభృతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్ట...