అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలి:
సర్పంచి లీల,సూపర్వైజర్ సునీత
ప్రజావాణి,నెల్లికుదురు:ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణిలు,బాలింతలు,పిల్లలు,కిషోర బాలికలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఇట్టె లీలా దేవేందర్ రెడ్డి,ఐసిడిఎస్ సూపర్వైజర్ జలగం సునీత సూచించారు.మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచికల్లు అంగన్వాడీ సెంటర్లో విసిపిసి కమిటీని గురువారం ఏర్పాటు చేశారు.దీనికి స్థానిక సర్పంచి ఇట్టె లీల దేవేందర్ రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జలగం సునీత, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ ప్రభృతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్యవివాహాలు చట్ట విరుద్ధమని,వీటిని ప్రోత్సహించవద్దన్నారు.
చిన్న వయసులో పెళ్లిళ్లతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు.
కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని,ఎక్కడైనా బాలికలకు ఇబ్బందులు ఎదురైతే 1098 కి కాల్ చేయాలని వారు సూచించారు.బాలికల వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ కార్యకర్తలు,బాలింతలు,తల్లులు,గర్భిణీలు గ్రామస్తులు పాల్గొన్నారు.