prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 8:46 am Digital Edition : PRAJA VANI

VB-G RAM G పథకం కింద మేట్లకు శిక్షణ కార్యక్రమం

VB-G RAM G పథకం కింద మేట్లకు శిక్షణ కార్యక్రమం
ఎంపీడీఓ ASGAY హమ్దాని

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 30

ఈరోజు ఉదయం 11:00 గంటలకు అడవిదేవులపల్లి మండలంలోని మొల్కచర్ల రైతు వేదికలో VB-G RAM G పథకం కింద మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎల్‌నినో (El Niño) ప్రభావం దృష్ట్యా రాబోయే రోజుల్లో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రకృతి వనరుల పరిరక్షణకు సంబంధించిన వివిధ పనుల నిర్వహణ విధానాలపై మేట్లకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా, పనుల నిర్వహణలో మేట్ల పాత్ర, బాధ్యతలు, కూలీల సమన్వయం, పనులకు కూలీల హాజరును పెంపొందించడం మరియు పనులు సజావుగా జరిగేలా చూడాల్సిన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మొల్కచర్ల, బాల్నేపల్లి, చిట్యాల, బంగారుకుంట తండా, నడిగడ్డ మరియు నల్లమిట్ట గ్రామ పంచాయతీలకు చెందిన నూతనంగా ఎంపికైన మేట్లు పాల్గొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ ASGAY హమ్దాని ఇన్‌చార్జి APO సూరా నాయక్ , ఇన్‌చార్జి EC రాధ మొల్కచర్ల మరియు బంగారుకుంట తండా గ్రామాల సర్పంచులు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు మరియు నూతనంగా ఎంపికైన మేట్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ హమ్దాని మాట్లాడుతూ, మేట్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, కూలీలను సమన్వయం చేసుకొని పనుల నిర్వహణలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటి సంరక్షణకు సంబంధించిన పనులకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ పథకం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు