NHM నాలుగో రోజు నిరవధిక సమ్మె
ఉద్యోగుల వినూత్న నిరసన
ప్రజావాణి అక్టోబర్ 16 NHM ఉద్యోగుల వినూత్న నిరసన కళ్ళకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఎన్ హెచ్ ఎం పరిధిలో 78 క్యాడర్లో పనిచేస్తున్న సుమారు 17,000 మంది ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను సాధన కోసం చేపట్టిన నిలవధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజు చేరుకుంది ఈ సందర్భంగా ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్ళపై నిలబడి వినూత్న నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమస్యలను విన్నవించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు
NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో 78 క్యాడర్లలో పనిచేస్తున్న 17000 మంది ఉద్యోగులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులేషన్ చేయాలి
ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వారి సేవలను గుర్తించాలని ఉద్యోగ సంఘం నాయకులు కోరారు అనేక సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

రాష్ట్రవ్యాప్తంగా 78 క్యాడర్లలో పనిచేస్తున్న సుమారు 17,000 మంది ఉద్యోగుల న్యాయపరమైన డిమాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులరైజేషన్ కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలోNHM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్ రాష్ట్ర కోశాధికారి సురేష్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ సభ్యులు చంద్రమౌళి సురేందర్ జి కిరణ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు