prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 10:07 pm Digital Edition : PRAJA VANI

NHM అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

NHM అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఉద్యోగుల నిరవధిక సమ్మెకు VCK రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ మద్దతు

భూపాలపల్లి, అక్టోబర్ 13,మన ప్రజావాణి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విముక్త చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

NHM ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఉద్యోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

NHM ఉద్యోగుల పోరాటానికి VCK పార్టీ, యూత్ విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తాయని అంబాల అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే పోరాటానికి అండగా నిలుస్తామని తెలిపారు.