prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 1:01 pm Digital Edition : SRIKANTH MULUGU

NH-163 అంటే రోడ్డు కాదు.. మరణాల ఉచ్చు..!

.రాస్తున్న రక్తచరిత్ర.. పస్రా-ఏటూరునాగారం మధ్య 45 కి.మీ నరకం.
. 7 మీటర్ల రోడ్డుపై 7000 వాహనాలు.. ఇది ప్రమాదం కాదు.. ప్రభుత్వ హత్యే..
. టోల్ వసూలు చేస్తారు.. సౌకర్యం కల్పించరు.
.స్థానికుడు.. అజీజ్

*ములుగు/పస్రా ప్రతినిధి (ప్రజావాణి):-* NH-163 అంటే హైదరాబాద్ నుండి ఛత్తీస్ గఢ్ వరకు వెళ్లే జీవనాడి. కానీ ములుగు జిల్లాలోకి వచ్చేసరికి అది మరణనాడిగా మారింది.
పస్రా నుండి ఏటూరునాగారం వరకు 45 కి.మీ రోడ్డు ఇప్పటికీ 1980 నాటి 7 మీటర్ల సింగిల్ లైన్ రోడ్డుగానే ఉంది. రోజూ 7000 వాహనాలు తిరిగే ఈ రోడ్డుపై రెండు వాహనాలు పక్కపక్కన వెళ్లలేని పరిస్థితి.
2014 లోనే జాతీయ రహదారిగా ప్రకటించినా 10 ఏళ్లయినా ఫోర్ లేన్ కాలేదు. ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. చైనా సరిహద్దులో అడవుల్లో రోడ్లు వేసిన కేంద్రానికి ములుగు అడవిలో రోడ్డు వేయడం కష్టమా..?
గత 5 ఏళ్లలో ఈ 30 కి.మీ స్ట్రెచ్ లో 400 ప్రమాదాలు, 180 మరణాలు జరిగాయని అధికారిక లెక్క. అనధికారిక లెక్క మూడు రెట్లు ఉంటుంది.
అటవీ శాఖ టోల్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు కానీ సైన్ బోర్డులు, లైట్లు, డివైడర్లు లేవు. ప్రజల ప్రాణాల మీద వ్యాపారం చేస్తున్నారు.
ప్రభుత్వాల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు ప్రజలు అడిగేది ఐటీ పార్కులు కాదు.. క్షేమంగా ఇంటికి చేరే ఒక రోడ్డు.తక్షణమే NH-163 ను ఫోర్ లేన్ గా ప్రకటించి వెడల్పు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికుడు ..అజీజ్.