prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 October 2026, 5:55 pm Digital Edition : PRAJA VANI

GVK ఇండస్ట్రీ కాలుష్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

GVK ఇండస్ట్రీ కాలుష్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి..

చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాలి – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, GVK ఇండస్ట్రీ కాలుష్య సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.గతంలో చిన్న స్థాయిలో ఉన్న GVK ఇండస్ట్రీ ప్రస్తుతం సుమారు 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిందని, పరిశ్రమ నుంచి వెలువడుతున్న నల్లటి పొగ, దుమ్ముతో చుట్టుపక్కల ఏడు నుంచి ఎనిమిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాత్రంతా వెలువడే పొగతో ఇళ్లలోకి దుమ్ము చేరుతోందని, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. గాలి, భూగర్భ జలాల కాలుష్యంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. పరిశ్రమ సమీపంలో భారీ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.ఇది గ్రామీణ ప్రాంతమని, హైదరాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక ప్రాంతం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పల్లెటూర్లలో నివసించే ప్రజలు, చిన్నారులు, పాఠశాలలపై కాలుష్య ప్రభావం పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.పరిశ్రమ విస్తరణకు సంబంధించిన అనుమతులు, కాలుష్య నియంత్రణ చర్యలు, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారా లేదా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల ఆరోగ్యం, గ్రామీణ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.