9 దొంగతనం కేసులు ఛేదించిన మెడిపల్లి పోలీసులు…రూ.2.50 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం.. నిందితుడి అరెస్ట్

మెడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 9 దొంగతనం కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి మొత్తం విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడిని బబ్లు పాశ్వాన్ (45)గా గుర్తించారు. ఇతడు కూలీగా పనిచేస్తూ ప్రస్తుతం చింతల్‌లోని షా సినిమా థియేటర్ వెనుక గణేష్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. స్వస్థలం...