prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 7:49 pm Digital Edition : PRAJA VANI

36 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందిన గణిపాక బిక్షపతి

36 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందిన గణిపాక బిక్షపతి

ఘనంగా సన్మానించిన జనగామ మున్సిపాలిటీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31 (ప్రజావాణి ): జనగామ మున్సిపాలిటీలో B.W.A. గా విధులు నిర్వహిస్తూ 36 సంవత్సరాల సుదీర్ఘ సేవలను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన గణిపాక బిక్షపతికి జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ జి. బిక్షపతి గత 36 సంవత్సరాలుగా జనగామ మున్సిపాలిటీలో అంకితభావంతో, క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించారని కొనియాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో, ప్రజలకు అందించే పౌర సేవల్లో తన వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అందరి మన్ననలు పొందారని తెలిపారు.

సుదీర్ఘ కాలం పాటు నిబద్ధతతో సేవలందించడం అభినందనీయమని, వారి సేవలు మున్సిపాలిటీకి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జి. బిక్షపతి ని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు.