సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు

సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వ్యాసరచన,చిత్రలేఖన పోటీలు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రధానోపాధ్యాయురాలు జె దుర్గాభవాని ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వ్యాసరచన,చిత్రలేఖన విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా 8వ తరగతి విద్యార్థులు రామ్‌చరణ్,హరీష్,6వ తరగతి తేజశ్విని తదితరులు తమ ప్రతిభను ప్రదర్శించి...