*భువనగిరి పట్టణంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్…*
*సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31*
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ ను నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ భద్రత , ఆన్లైన్ మోసాలు , డిజిటల్ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచార రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోస పూరిత వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అను మానాస్పద లింకులు , ఫోన్ కాల్స్ , సందేశాల పట్ల జాగ్రత్తగా వ్యవహ రించాలని సూచించారు.
సైబర్ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని , ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నియమాలు పాటిస్తూ ఇతరులకు కూడా అవ గాహన కల్పించాలని జిల్లా పోలీసులు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో భువనగిరి డీఎస్పీ రవీందర్ , సీఐలు వెంకటేశ్వర్లు , చంద్రబాబు , సూర్య నాయక్ , ఎస్ఐలు అనిల్ , లక్ష్మీనర్సయ్య లతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.