దారి ఇలా…నడిచేదెలా.
దారి ఇలా...నడిచేదెలా. చినుకు పడితే చిత్తడే, ఆద మరిచి అడిగితే అంతే. ఏటూరునాగారం అక్టోబరు 31 ప్రజావాణి: చిన్నపాటి చినుకు పడినా చాలు,ఊర్ల మధ్య ఉన్న ప్రధాన రహదారులు బురదమయంగా మారి నరకాన్ని తలపిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్డు పైనే చేరడంతో మట్టి కొట్టుకుపోయి మోకాలు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై వాహనాలు రాకపోకలు సాగించడంతో బురద గుంటలుగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి....